Thursday, May 9, 2013

క్యాప్సికం చట్నీ

 
క్యాప్సికం చట్నీకావలసిన పదార్థాలు
*****************************
క్యాప్సికం - అరకిలో,
ఎండుమిర్చి - 8,
శనగపప్పు - 50 గ్రాములు,
మినప్పప్పు - 50 గ్రాములు,
ఆవాలు - 4 స్పూన్లు,
మెంతులు - 1 స్పూను
కరివేపాకు - 2 రెమ్మలు,
ఉప్పు - తగినంత,
ఇంగువ - 1/2 స్పూను,
పసుపు - 1/2 స్పూను,
చింతపండు - కొద్దిగా,
నూనె - 50 గ్రాములు

క్యాప్సికం చట్నీ తయారు చేసే విధానం...
**********************************

పైన చెప్పుకున్న వాటిలో సగం మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. చివరిలో కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ సారి నూనె లేకుండా మిగిలిన ఆవాలు, మినప్పపు, శనగపప్పు, మెంతులు, ఎండుమిర్చి వేయించాలి. చల్లారాక పొడి చేసుకోవాలి. బాండీలో మిగిలిన సగం నూనె వేసి క్యాప్సికం ముక్కలు వేయించాలి. ఇందులో తాలింపు గింజల పొడి, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. దీన్లో ముందు తాలింపు వేసిపెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకుంటే క్యాప్సికం చట్నీ రెడీ. కావాల్సిన వారు బెల్లం కొంచెం వేస్కోవచ్చు. నేను వేస్తాను ...

No comments:

Post a Comment